ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి

national |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 05:19 PM

ఒడిశాలోని ప్రఖ్యాత కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి 122 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోనుంది. 13వ శతాబ్దానికి చెందిన ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంలోని జగమోహన హాల్ (గర్భగుడి)లో శతాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకను తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) చేపట్టింది. ఈ చారిత్రక ప్రక్రియ రానున్న మూడు నెలల్లో పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు.1903-04 సంవత్సరంలో బ్రిటిష్ అధికారులు ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచేందుకు ఈ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేశారు. ఆలయం వెనుక భాగంలోని గోడ బలహీనపడి, పగుళ్లు ఏర్పడటంతో, అది కూలిపోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ హాల్‌లోకి భక్తులకు గానీ, సందర్శకులకు గానీ ప్రవేశం లేదు.ప్రస్తుతం ఏఎస్ఐ, ఐఐటీ మద్రాస్ నిపుణులతో కూడిన 30 మంది సభ్యుల బృందం ఈ క్లిష్టమైన పనిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తోంది. రాళ్లలో సూక్ష్మమైన పగుళ్లు ఉన్నాయని, ఒకేసారి ఇసుకను తొలగిస్తే నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని ఐఐటీ నివేదిక హెచ్చరించింది. దీంతో, దశలవారీగా ఇసుకను తొలగిస్తూ, ఎప్పటికప్పుడు రాళ్లకు సపోర్ట్ ఇస్తూ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa