మార్చి లేదా ఏప్రిల్లో జరిగే పదో తరగతి పరీక్షలు ఒడిశాలో ముందుగానే ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత, నిఘా నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 3,082 కేంద్రాల్లో 5.61 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఒడిశా సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (BSE) పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందుకోసం మూడంచెల స్క్వాడ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలు, నోడల్ సెంటర్లపై 24 గంటల నిఘా ఉంచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరాలతో ప్రశ్నాపత్రాల సీల్ తెరవడం నుంచి పరీక్ష గదుల్లోని కార్యకలాపాల వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక తనిఖీ బృందాలు కూడా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శిస్తున్నాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది కేవలం విద్యాపరమైన మూల్యాంకనం మాత్రమే కాదని, విద్యార్థుల సహనం, పట్టుదల, ఆత్మవిశ్వాసానికి నిజమైన పరీక్ష అని సీఎం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa