ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే చదువుకు, ఉపాధికి మహిళలను దూరం చేసిన తాలిబన్లు.. తాజాగా గృహహింసకు మద్దతిచ్చేలా అమానవీయ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. పురుషులు తమ ఇంట్లోని మహిళలను, పిల్లలను శారీరకంగా హింసించినా అది నేరం కాదని కొత్త పీనల్ కోడ్‌లో పేర్కొనడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.ఇంట్లో మగవారు మహిళలను కొట్టినప్పుడు రక్తం రాకపోయినా, ఎముకలు విరగకపోయినా దానిని నేరంగా పరిగణించరు. అంటే, గాయాలు బయటకు కనిపించనంత వరకు ఎంత హింసించినా అది చట్టబద్ధమే. ఒకవేళ భర్త దాడిలో ఎముకలు విరిగితే, బాధితురాలు దానిని కోర్టులో నిరూపించగలిగితే నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష పడుతుంది. అయితే, బాధిత మహిళ కోర్టుకు వెళ్లాలంటే ఆమె వెంట తప్పనిసరిగా ఒక పురుషుడు ఉండాలి.న్యాయమూర్తికి తన గాయాలను చూపేటప్పుడు కూడా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచుకోవాలనే నిబంధన విధించారు. ఈ మేరకు కొత్త నిబంధనలపై ఆఫ్ఘన్ సుప్రీంలీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశారు. ఇది బాధితులకు న్యాయం అందకుండా చేసే కుట్రగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భర్త అనుమతి లేకుండా భార్య బంధువుల ఇంటికి వెళ్తే సదరు మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa