ఏపీలో భూ ప్రకంపనలు కలకం రేపాయి. పల్నాడు జిల్లాతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామున పల్నాడు జిల్లా వినుకొండతో పాటు నడిగడ్డ.. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. వినుకొండలో భూ ప్రకంపనలతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించిందని చెబుుతున్నారు. ఆ భయంతో బయటే ఉండి.. కొంత సమయం తర్వాత మళ్లీ ఇళ్లలోకి వెళ్లారు. ఈ భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం చెబుతోంది. వినుకొండకు వాయవ్య దిశలో 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ధ్రువీకరించింది.
గతంలో ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా సరిహద్దులో భూ ప్రకంపనలు వచ్చాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వరుసగా భూ ప్రకంపనలు రావడంతో జనాలు భయంతో వణికిపోయారు. ఒకే రోజులో రెండు, మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేశారు. ముండ్లమూరు, తాళ్లూరు, పొదిలి మండలాల్లోని గ్రామాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఒకే రోజు ఉదయం, సాయంత్రం ప్రకంపనలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మళ్లీ ఎప్పుడు, ఎక్కడ భూ ప్రకంపనలు వస్తాయోనని భయపడ్డారు. పగటిపూట కూడా ప్రకంపనలు రావడంతో స్కూల్స్ నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అంతేకాదు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు కూడా భయంతో బయటకు వచ్చారు.
వరుస భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళనలో ఉండటంతో మంత్రులు, అధికారులు సమావేశం నిర్వహించారు. తరచుగా పొదిలి, దర్శి ప్రాంతాల్లో ఎక్కువగా భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో కారణాలపై అధ్యయనం చేయాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను (జీఎస్‌ఐని) కోరారు. అయితే ఈ భూ ప్రకంపనలపై హైదరాబాద్‌లో ఉన్న
ఎన్‌జీఆర్‌ఐ సంస్థ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఈ క్రమంలో వారు కొన్ని కారణాలను చెప్పుకొచ్చారు. భూ ప్రకంపనలు వస్తున్న ముండ్లమూరు, తాళ్లూరు ప్రాంతాలకు సమీపంలో గుండ్లకమ్మ నది ప్రవహిస్తోంది. ఆ నది స్వరూపంలో మార్పుల కారణంగానే భూ ప్రకంపనలు సంభవించాయని.. అది కూడా స్వల్పం అని చెప్పారట. భయపడాల్సిన పనిలేదన్నారట. అయితే మళ్లీ చాలా రోజుల తర్వాత భూ ప్రకంపనలు రావడంతో జనాలు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇవి స్వల్పంగా ఉండటంతో భయపడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద మరోసారి భూ ప్రంకపనలు భయపెట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa