ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నెవిటేర్ వ్యవస్థలో 45 నిమిషాల పాటు సాంకేతిక లోపం ఏర్పడింది. దీనివల్ల బుకింగ్, చెక్ఇన్ ప్రక్రియలు నిలిచిపోయి, సిబ్బంది మాన్యువల్‌గా పనిచేయాల్సి వచ్చింది. ఈ సమస్యతో వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముంబయి సహా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇండిగో, ఆకాశా ఎయిర్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వంటి విమానయాన సంస్థల సర్వీసులు ప్రభావితమయ్యాయి. గంటలోపే సమస్యను పరిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa