సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆ సందడే వేరు. ఏ పండగకు వెళ్లకున్నా.. సంక్రాంతి పండగకు దాదాపుగా అందరూ వెళ్తుంటారు. ఏడాదిలో ఓ ఫెస్టివల్‌ను కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా జరుపుకుంటారు. మరి వెళ్లాలంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాల్సిందే.. బస్సులో వెళ్లేందుకు కొందరికీ ఓపిక ఉండదు. మరికొందరు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని తట్టుకోలేరు. అందుకే రైళ్ల వైపు చూస్తుంటారు. ట్రైన్స్ ఎప్పుడో బుక్ అయి ఉంటాయి. పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ వేసింది.
ట్రైన్ నంబర్ 07055- జనవరి 10వ తేదీన తిరుపతి నుంచి సికింద్రాబాద్
ఉదయం 8.25 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ట్రైన్ నంబర్ 07056- జనవరి 11వ తేదీన సికింద్రాబాద్ నుంచి కాకినాడకు
రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 6.45 గంటలకు కాకినాడ చేరుతుంది.
ట్రైన్ నంబర్ 07057- జనవరి 12వ తేదీన కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వరకు
రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్ బయల్దేరి మరునాడు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
ట్రైన్ నంబర్ 07071- జనవరి 13వ తేదీన సికింద్రాబాద్ నుంచి కాకినాడ వరకు
రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ బయల్దేరి మరునాడు ఉదయం 8.30 గంటలకు కాకినాడ చేరుతుంది.
ట్రైన్ నంబర్ 07072- జనవరి 14వ తేదీన కాకినాడ టౌన్ నుంచి తిరుపతికి
ఉదయం 10 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరి ఆ రోజు రాత్రి 8.20 గంటలకు తిరుపతి చేరుతుంది.
ట్రైన్ నంబర్ 02707- జనవరి 15వ తేదీన తిరుపతి నుంచి కాచిగూడ వరకు
ఉదయం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కాచిగూడ చేరుతుంది.