ఎర్ర సముద్రంలో గత కొంత కాలంగా వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ రెబల్స్ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హౌతీ రెబల్స్ దాడులకు ప్రతికారంగా అమెరికా, బ్రిటన్ సైన్యాలు శుక్రవారం దాడులు నిర్వహించాయి.
యెమెన్లో హౌతీల అధీనంలో ఉన్న లాజిస్టిక్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేశామని అమెరికా అధికారులు తెలిపారు. భారీ క్షిపణులతో పాటు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి.