అసోంలో సంక్రాంతి పండుగను మాగ్ బిహును అని లేదా భోగాలి బిహు అని కూడా పిలుస్తారు. అసోంలో ఇది పంట పండుగ. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ఉత్సవాలు, దీపోత్సవాలు కూడా నిర్వహిస్తారు.
ఇక్కడి యువత బిహు సమయంలో వెదురు ఆకులు, గడ్డితో మెజీ అనే ఇళ్లను నిర్మిస్తారు. మరుసటి రోజు ఆ గుడిసెలను తగులబెట్టి పండుగ ప్రత్యేక వంటకాలను ఆస్వాదిస్తారు. టేకేలి భోంగా (కుండ పగలగొట్టడం), గేదెల పోరు వంటి స్థానిక సంప్రదాయ కళలు కూడా పండుగలో భాగంగా ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa