ఒకప్పుడు భోగి మంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. తర్వాత పిడకలు చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు.
కానీ ఇప్పుడు రబ్బర్ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగి మంటల్లో వేస్తున్నారు. పెట్రోలు, కిరోసిన్ వంటి ఇంధనాలను వాడేస్తున్నారు. ఇలాంటి భోగి మంటల వల్ల ఆరోగ్య సమస్యలు రావటం ఖాయమంటున్నారు. ఇలాంటి హాని కలిగించేవి భోగి మంటల్లో వేయకూడదని పెద్దలు చెబుతున్నారు.