ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు ముగ్గులు వేస్తుండగా.. అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విని(18) మృతి చెందగా.. పల్లవీ దుర్గ(16) తీవ్రగాయాలయ్యాయి.
బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa