ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం 76వ ఆర్మీ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ కూడా పాల్గొన్నారు.ఇండియన్ ఆర్మీ సెంట్రల్ కమాండ్‌లోని సూర్య స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైనికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.భారత సైన్యం ఈ ఏడాది రెండోసారి ఢిల్లీ వెలుపల ఆర్మీ డే కార్యక్రమాన్ని నిర్వహించడం గమనించదగ్గ విషయం. ఈ సందర్భంగా సూర్య స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కవాతు అనంతరం శౌర్య సంధ్యను నిర్వహించారు.