మూడు రోజులు ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. ముఖ్యంగా కనుమను పశువుల పండుగ అంటారు.
నేడు రైతులు పశువులను అందంగా అలంకరించి తమ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకుంటారు. అలాగే మరి కనుమ రోజున తెలుగు రాష్ట్రాల్లో ముక్క లేనిదే ముద్ద దిగదు. నాన్ వెజ్ ప్రియులు నాటుకోడి కంటే ధర ఎక్కువైనా మటన్ కే మా ఓటు అంటున్నారు.