సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు మదురైలోని అవనియాపురంలో ప్రారంభమైన జల్లికట్టు పోటీలో అపశృతి చోటుచేసుకుంది. ఈ పోటీలో పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు.
ఈ క్రమంలో గాయపడిన వారిని మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం 1,000 ఎద్దులు, 600 వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి. మరో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.