రష్యా వైమానిక దళంలో ప్రధాన పాత్ర పోషించే రెండు కమాండ్ విమానాలను ఉక్రెయిన్ కూల్చివేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ వలెరీ జలుజ్ని వెల్లడించారు.
ఉక్రెయిన్ కూల్చిన ఏ-50 రాడార్ డిటెక్షన్ విమానం, ఐఎల్-22 కంట్రోల్ సెంటర్ విమానం రష్యాకు అత్యంత విలువైనవి అని తెలిపారు. అజోవ్ సముద్రం మీదుగా వెళ్తున్న క్రమంలో ఈ రెండు విమానాలను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.