సంక్రాంతి తర్వాత రోజు జరుపుకొనే పండుగ కనుమ. ‘కనుమ’ అంటే పశువు అని అర్థం. దుక్కి దున్నిన నాటి నుంచి పంట ధాన్యాన్ని గాదెలకు చేర్చేవరకు శ్రమించిన పశువులను ఆరాధించడమే కనుము పండుగలోని పరమార్థం.
కనుమ రోజున పశువులను రైతన్నలు ప్రత్యేకంగా కొలుస్తారు. వాటిని కడిగి పసుపు, కుంకుమతో అలంకరించి ముఖానికి బొట్టు పెట్టి ఊరేగిస్తారు. అలాగే, కనుమ రోజు పితృదేవతలకు పూజలు చేస్తారు.