టెలికామ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలాంటి వాటికి స్పందించవద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) వెల్లడించింది.
*401# అని నొక్కగానే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్లిపోతాయని, కాల్ ఫార్వార్డ్కు పర్మీషన్ ఇచ్చినట్లు అవుతుందని పేర్కొంది. మీ కాల్స్ మోసగాళ్లు రిసీవ్ చేసుకుంటే మీ స్నేహితులు, బంధువులను మోసం చేసే అవకాశం ఉందని చెప్పింది.