ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో మరో ఉద్రిక్తత మొదలైంది. ఇరాక్‌లోని కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్‌లోని గూఢాచార స్థావరాలు, ఇరాన్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించినట్లు
‘ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్’ వెల్లడించింది. సిరియాలోని ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్’ శిబిరాలనూ ధ్వంసం చేసినట్లు చెప్పింది. ఈ దాడులు ఎర్బిల్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలోనే జరిగినట్లు తెలుస్తోంది.