ఏపీలో సంక్షేమ పథకాలపై ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమ్మఒడి, చేయూత, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వాహనమిత్ర లాంటి పథకాలు వస్తున్నాయా అంటూ ఫోన్‌కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు..
ఏదైనా పథకం రాకపోతే వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామంటూ కేటుగాళ్లు లింక్ పంపిస్తున్నారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫోన్‌కాల్స్ నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.