దేశంలో గత దశాబ్దకాలంలో (2012 - 2022)వాతావరణ మార్పుల వల్ల నైరుతి రుతుపవనాల వర్షపాతం 55శాతం మండలాల్లో 10%మేర పెరిగినట్లు కొత్త అధ్యయనం ఒకటి వెల్లడించింది. దేశంలోని 4,500కు పైగా మండలాల వర్షపాత గణాంకాలను స్వతంత్ర అధ్యయన సంస్థ ‘ది కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్’ (CEEW)విశ్లేషించింది. గత దశాబ్దకాలంలో 11శాతం మండలాల్లో నైరుతి రుతుపవనాల వర్షపాతంలో తగ్గుదల నమోదైనట్లు పేర్కొంది.