విజయవాడ నడిబొడ్డున ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో అనిపిస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టికోకపోవడం అంటరానితనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. పేదపిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదు. మన ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదని సీఎం వైయస్ జగన్ దుయ్యబట్టారు. శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.