ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో తయారు చేసిన పశు మాంస ఖండిక(స్టీక్స్)ల విక్రయానికి అలెఫ్ ఫామ్స్ సంస్థకు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా వెల్లడించింది.
ప్రపంచంలో 150కిపైగా సంస్థలు ల్యాబ్ మాంస విక్రయానికి సిద్ధమవుతున్నాయి. జంతు మాంస కణాలను కానీ, ఫలదీకరణ చెందిన అండాన్ని కానీ ప్రయోగశాలలో పెద్దపెద్ద ఉక్కు తొట్టెలలో పెంచి మాంసాన్ని తయారుచేస్తారు.