బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామంలో గల సచివాలయ సిబ్బంది మొత్తం కుల గణన సర్వేలో నిమగ్నమయ్యారు. శనివారం విద్యా, సంక్షేమ సహాయకులు డి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సర్వే 19వ తేదీ నుంచి ప్రారంభం అయ్యిందని, ప్రతీ ఒక్కరూ ఈ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు, కులం, వివాహ స్థితి, విద్యార్హత, బియ్యం కార్డ్ నెంబర్ వంటి వివరాలు తెలియజేయాలని కోరారు.