ఓ వృద్ధుడు 50ఏళ్లకు పైగా బర్గర్ తింటూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన డాన్ గోర్స్కే(70) 1972 నుండి బర్గర్స్ తినడం ప్రారంభించాడు.
2018లో ఆయన 30,000 బిగ్ మాక్ బర్గర్లను, 2021లో 32వేలు, జనవరి 2023 నాటికి 33,400 బిగ్ మాక్ బర్గర్లను తింటూ రికార్డు సృష్టించాడు. ఆయన తిన్న ప్రతి బర్గర్ పార్శిల్ బాక్స్, రశీదును జతచేశాడు. ఆ వీడియో వైరల్ గా మారింది.