డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం జరిగే భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. అమలాపురం లోక్‌సభ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ, జనసేన నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా మండపేటలో నిర్వహించేది 11వ బహిరంగ సభ. లక్ష మందిని సమీకరించడంలో ఇరు పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. కాగా మండపేటతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో కూడా నేడు చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్నారు.