మరికొద్ది గంటల్లో అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠపనోత్సవం జరగనుంది. అయితే అయోధ్యలో రాముడి దర్శనానికి ఎంతమంది వచ్చినా.. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది.
ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఒకే తరహా దర్శనానికి ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనంతో పాటు ప్రసాదం కూడా ఉచితంగానే అందించాలని నిర్ణయించారు. ఉచిత వసతి కల్పనపైనా ఆలోచనలు చేస్తున్నారు.