రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైనా నిద్రపోని వారిలో గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. రాత్రివేళల్లో 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రించిన వారిలో 27శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధ్యయన వేత్తలు గుర్తించారు. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా నిద్రించేందుకు సమయాన్ని కేటాయించాలని సూచిస్తున్నారు.