అయోధ్యలో శ్రీరామ మందిరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.! రామ మందిరం సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించబడినది. మందిరానికి 20 అడుగుల ఎత్తులో 3 అంతస్తులు ఉంటాయి. మందిరంలో 392 స్తంభాలు, మొత్తం 44 ద్వారాలు ఉంటాయి. మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రామ్ లల్లా విగ్రహం ఉన్న గర్భ గృహం మొదటి అంతస్తులో ఉంటుంది.
అయోధ్య శ్రీరామ మందిరంలో ఐదు మండపాలు ఉంటాయి. పూజ మండపం, నృత్య మండపం, కీర్తన మండపం, రంగ మండపం, సభా మండపం. వీటితో పాటు ప్రాంగణంలోని అదనపు మందిరాల పేర్లు భగవాన్ గణేష్, భగవాన్ శివ, మా భగవతి, సూర్య దేవ్. అదనంగా హనుమాన్ జీ, అన్నపూర్ణ మందిరాలు కూడా ఉంటాయి.
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రామమందిరానికి పద్మనాభస్వామి ఆలయం ఓనవిల్లును కానుకగా ఇవ్వడం జరిగింది. సీతమ్మ జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ నుండి అయోధ్య ధామ్ వరకు భగవాన్ రాముడు కోసం వివాహ కానుకలను తీసుకు వెళ్ళారు. థాయ్‌లాండ్ దేశం ప్రత్యేక మట్టి, 2 పవిత్ర నదుల నుండి నీటిని పంపింది.