అయోధ్యలో బాల రాముడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఒడిశాకు చెందిన ఓ శిల్పి అగ్గిపుల్లలతో రామ మందిరాన్ని తయారు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
సాస్వత్ రంజన్ అగ్గిపుల్లలతో రామ మందిరం తయారు చేయడానికి ఆరు రోజులు పట్టిందని, మొత్తం 936 అగ్గిపుల్లలను ఉపయోగించినట్లు చెప్పారు. ఈ ఆలయం 4 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పుతో ఉంటుందని తెలిపాడు. దీన్ని ప్రధాని మోడీకి ఇవ్వాలని కోరికగా ఉందని చెప్పాడు.