అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా భక్తులు వారికి తోచిన విధంగా భక్తిని చాటుకున్నారు.
ఈ క్రమంలో ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన దుష్యంత్ మెహర్ కుటుంబం ‘రామాయణ గాథ’తో చీరను తయారు చేశారు. రామాయణంలోని రామసేతు గాథను చిత్రాలతో చీరపై వర్ణించారు. ఈ ప్రత్యేక చీరను ఢిల్లీలోని జగన్నాథ దేవాలయం హౌజ్ ఖాస్‌లో మేకర్స్ ప్రదర్శించారు.