రాజ్యసభ ఎన్నికలపై తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.... రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు మమ్మల్ని అడుగుతున్నారన్నారు. అభ్యర్ఝిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదిస్తున్నారన్నారు. గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా విషయంలో మూడేళ్ల పాటు స్పీకర్, సీఎం గాడిదలు కాస్తున్నారా..? అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. సీఎం జగన్ భయపడుతున్నారని.. అందుకే ఆయన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని విమర్శించారు. మూడేళ్లుగా పెండింగులో ఉన్న రాజీనామాను ఎందుకు ఆమోదించ లేదని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రం బాగుండాలని పార్టీలో చాలా మంది చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.