ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు, నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విభజన సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్‌లో ఉన్నారని.. ఏ విధంగా నక్కి నక్కి దాక్కొని ప్లకార్డు పట్టుకున్నారని ప్రశ్నించారు. ఆరోజే అన్న విశ్వసనీయతను షర్మిల ప్రశ్నిస్తే బాగుండేదన్నారు. అధికారంలోకి ఎలాగో రాలేమని కాంగ్రెస్ మొదటి సంతకం ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు షర్మిల రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఆయన మరణానికి సంబంధించి కాంగ్రెస్‌పై షర్మిల అనుమానం వ్యక్తం చేశారని అన్నారు. అన్న వదిలిన బాణం ఎవరికి మేలు చేద్దామని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.