వైఎస్సార్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీపై విమర్శల దాడి చేస్తున్న నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బూతుల మినిస్టర్లు, బూతుల యూనివర్సిటీ కుప్పకూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారనే ఆయన మీడియాకు తెలియజేశారు. అలాగే పెద్దిరెడ్డి, అంబటి రాంబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరకు వైసీపీకి మిగిలేది 17 స్థానాలే అంటూ పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు.