నిరుపేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు. నిరుపేద పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవడం, అది కూడా కేవలం తెలుగు మీడియమ్‌లోనే చదవడం.. మరోవైపు ధనికులైన పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమ్‌లోనే చదవడం సరికాదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నిరుపేదలు, ధనికుల మధ్య కొనసాగుతున్న ఈ తేడా తొలగాల్సి ఉంది. ధనికుల మాదిరిగా నిరుపేద పిల్లలు కూడా చదవాల్సి ఉంది. వారికి ఆ విధంగా విద్యను అందించాల్సి ఉందన్నారు. ఈ 56 నెలల పాలనలో నా వంతుగా నేను శాయశక్తులా చిత్తశుద్ధితో పని చేశాను. దాన్ని ఆత్మ విశ్వాసంతో చెప్పగలను. కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలు తాకాను. అది నాకెంతో తృప్తి ఇస్తోందన్నారు.