సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై విరుచుకుపడ్డారు. షర్మిల మాటలు చూసి జాలేస్తోందని.. షర్మిల మాటల్లో కొత్తదనం లేదన్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలనే షర్మిల మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబే అని ఆరోపించారు. కేంద్రానికి కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డే.. ప్రధాని మోడిని కలిశారన్నారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాలు కోఆర్డినేషన్‌తో వెళ్లాలని అన్నారు. తాము మూడు రాజధానులకి మద్దతు ఇస్తే.. బీజేపీ అమరావతికి జై కొడుతోందన్నారు. ప్రతిపక్షాలకు అధికారం కావాలి... తమకు సంక్షేమం కావాలన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని... మరో డెబ్బై రోజుల్లో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. చంద్రబాబు, జగన్ పాలనలో ఎవరి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ప్రశ్నించారు.