‘ఇండియా’ కూటమి నుంచి నితీశ్ కుమార్ వైదొలగడాన్ని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. అది సరైన నిర్ణయం కాదన్నారు. ఈతరహా వ్యవహారం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కూటమిలో ‘ఆప్’ కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో చర్చలు జరుపుతోంది.