ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి వచ్చిన దరఖాస్తులను బీజేపీ అగ్రనేతలు పరిశీలించారని తెలిపారు. సుమారు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పొత్తులపై పార్టీ అధిష్టానం త్వరలోనే క్లారిటీ ఇస్తుందని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.