కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బడ్జెట్ సమయాల్లో మార్పు తీసుకురావడం జరిగింది. వాస్తవానికి స్వాతంత్య్రం అనంతరం కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం ప్రవేశపెట్టేవారు. 1999 ఏడాదిలో ఆ సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకు మళ్లీ బడ్జెట్ సమయాల్లో మార్పు చేయడం జరిగింది. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 28కి బదులుగా ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు.