పెసర సాగులో సరైన ఎరువుల యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. పశువుల ఎరువును ఎకరాకు మోతాదులో రెండువేల కిలోల వరకు తీసుకొని దుక్కిలో వేసి కలియదున్నాలి.
నత్రజని ఎరువులు ఎకరానికి ఎనిమిది కిలోల వరకు తీసుకొని విత్తనం చల్లె ముందు వేసుకోవాలి. భాస్వరంను ఎకరానికి 20 కిలోలు తీసుకొని విత్తనం చల్లె ముందు వేసుకోవచ్చు. వరి మాగాణుల్లో ఎరువులు వాడకం అవసరమే లేదు.