సామర్లకోట పట్టణంలో 26వ వార్డు కౌన్సిలర్ నక్కా లలిత(37) అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. అస్వస్థతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. వైసీపీ పార్టీ తరపున గెలుపొందిన లలిత వార్డులో పలుసమాజ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. భర్త , మామ, మరిదిల ప్రోత్సాహంతో పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించిన పెరు ఉంది. కౌన్సిలర్ లలిత మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.