కొద్ది నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్‌లో గురువారం ఉదయం 11 గంటలకు ఆమె తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యంతర బడ్జెట్‌లో తాయిలాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని, మహిళా సాధికారిత పెరగాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌లో వారికి పెద్దపీట వేయొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు