ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరపడిందని... ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎంకు లేదని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం విశాఖలో పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి, విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేస్తే మెడకు ఉరితాడు బిగించుకున్నట్లేనని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని.. మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.