రాయల్ కరీబియన్ సంస్థకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌకకు ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, ఆర్జెంటినా స్టార్ ప్లేయర్ లయోనెల్ మెస్సీ నామకరణం చేశారు.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి తన తొలి ప్రయాణానికి సిద్ధమైన నౌకాకు 'ఐకాన్ ఆఫ్ ద సీస్' గా పేరు పెట్టారు. ఈ నౌకలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అథితిగా మెస్సీ హాజరయ్యారు. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో ఈ నౌకను తయారు చేశారు.