ఎంపీ భరత్ పెర్ఫార్మెన్స్ ఏమిటో పార్లమెంట్‌లో అందరికీ తెలుసని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో తాను ఎక్కువ శాతం డిబేట్‌లో పాల్గొనలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తామని చెప్పిన భరత్ చిట్టా తన వద్ద ఉందని, అతను ఎపుడు రాజీనామా చేస్తాడో చెప్పాలని ఆదిరెడ్డి వాసు ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తాను మాత్రమే మాట్లాడుతున్నానని రాష్ట్రావసరాలను తానే లేవనెత్తుతున్నానని, తాను కష్టపడిన దానిలో 50 శాతం మరే ఎంపీ అయినా కష్టపడుతున్నాడా ? అంటూ భరత్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవానికి పార్లమెంట్‌లో జరిగిన డిబేట్స్‌లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు 80 శాతం డిబేట్స్‌లో పాల్గొంటే కాకినాడ ఎంపీ వంగా గీత 75 డిబేట్స్‌లో పాల్గొన్నారని, రీల్ స్టార్ రాజమహేంద్రవరం ఎంపీ భరత్ కేవలం 46 డిబేట్స్‌లోనే పాల్గొన్నారని చెప్పారు. ఎంపీ నిధుల వినియోగం విషయానికి వస్తే ఎంపీ రామ్మోహననాయుడు 89 శాతం నిధులు వినియోగించుకున్నారని, భరత్‌రామ్ మాత్రం కేవలం 62 శాతం నిధులు వినియోగించుకున్నారని చెప్పారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం చేతకాదని నగర పాలక సంస్థ నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రజల సొమ్మును తన బిల్డప్ కోసం వాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తయితే వైసీపీ ప్రభుత్వం కేవలం 4 శాతం మాత్రమే పూర్తి చేసిందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో నగరంలో టెన్నిస్ కోర్టు, ఆర్ట్స్ కళాశాల మైదానంలో రన్నింగ్ ట్రాక్, స్కేటింగ్ రింగ్ వంటివన్ని పూర్తి చేసామని, అయితే వాటిపై భరత్‌రామ్ బిల్డప్ వ్యాఖ్యలు చేస్తున్నారని, భరత్‌రామ్ చేసేవన్ని చిల్లర రాజకీయాలని మండిపడ్డారు. దమ్ముంటే జగన్‌ను రాజమండ్రిలో పోటీకి దింపండి..డిపాజిట్లు కూడా రావన్నారు. ఇప్పటికే జగన్‌కు సన్‌స్ట్రోక్ మాదిరిగా సిస్టర్ స్ట్రోక్ తగిలిందని జగనన్న బాణమే జగన్‌కు తిరిగి గుచ్చుకుంటుందని చమత్కరించారు. ఈ సమావే శంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కార్యదర్శి లాల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.