ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల్ల అటవీ ప్రాంతంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ వంతెనను టాటా ఏసీ వాహనం బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో టాటా ఏసీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియవలసి ఉందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.