ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన జరిగింది. టిక్‌టాక్ శ్రీను అనే వ్యక్తి.. ఒంటరి తనం భరించలేక ఒ క వ్యక్తి కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన యడ్లపల్లి శ్రీనివాస్ అలి యాస్ టిక్‌టాక్ శ్రీనుగా బాగా పరిచయం. మృతుడు శ్రీనివాస్ సగ్గొండ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అయితే టిక్‌టాక్ చేస్తూ మంచి పేరు సంపాదించాడు. జీవితం సాఫీగా సాగిపోతుండగా 8 ఏళ్ల క్రితం ఇద్దరు పిల్లలు.. పాము కాటుతో రోజుల తేడాతో చనిపోయారు. ఆ తర్వాత భార్య భర్తలిద్దరూ ఒక బాలికను దత్తత తీసుకున్నారు.
ఇంతలో శ్రీను భార్య, తండ్రి ఏడాది కిందట చనిపోయారు. అప్పటి నుంచి మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు.ప్రస్తుతం తల్లి, దత్తత కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. ఏం జరిగిందో ఏమో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై బైక్ పార్క్ చేసి నదిలో దూకేశాడు. కొవ్వూరు ఇసుక ర్యాంపు పడవ కార్మికులు గమనించి శ్రీనివాస్‌ను నది నుంచి ఎరినమ్మఘాట్ ఇసుక ర్యాంపుకు తీసుకువచ్చారు. అప్పటికే మృతిచెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి మేనల్లుడు పవన్‌కుమార్ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.