కేరళ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ రెండో పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పర్యాటక రంగానికి గణనీయమైన ప్రోత్సాహంతో పాటు రాష్ట్రంలో మద్యం ధరల పెంపు కీలక ప్రకటనలలో ఒకటి. మే 2024 నుంచి విజింజం పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి తెలిపారు.కె-రైల్ ప్రాజెక్ట్ మరియు కోజికోడ్ మరియు తిరువనంతపురం లైట్ మెట్రో ప్రాజెక్టులను కొనసాగించాలని రాష్ట్రం యోచిస్తోందని కెఎన్ బాలగోపాల్ ప్రకటించారు.కేరళలో మద్యం ధరలను పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రకటనలో పేర్కొంది. ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.10 పెంచనున్నారు. విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వారికి యూనిట్‌కు 15 పైసలు (గతంలో 1.12 పైసలు) అదనంగా పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ప్రకటించారు. ప్రజావాణి కార్యక్రమం, నవకేరళం సదస్సు సందర్భంగా ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మొత్తం రూ.1,000 కోట్లు కేటాయించారు.పర్యాటక రంగ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కేటాయించారు.
ప్రభుత్వ విద్యా రంగానికి రూ.1,032 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజల నుంచి సాయం అందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.