అమెరికాలోని కాలిఫోర్నియాలో తుపాను కారణంగా కుంభవృష్టి కురిసింది. దీంతో రాష్ట్రంలోని దక్షిణాన ఉన్న పర్వతప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రభుత్వం కోరింది.
అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని లాస్ ఏంజిలెస్ మేయర్ విజ్ఞప్తి చేశారు. చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకొచ్చింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల చెట్టు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.