ఎన్నికల ప్రచార సీజన్‌లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ భాగస్వాములను చేస్తున్న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం,
ర్యాలీల్లో నినాదాలు చేయడం ద్వారా పిల్లలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవద్దని ఈసీ పార్టీలకు స్పష్టం చేసింది. పార్టీలు ఎన్నికలు, కార్యక్రమాల్లో పిల్లలను ఉపయోగించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉందని మరోసారి గుర్తు చేసింది.