విజయవాడ గుణదల మేరీమాత ఆలయం శతాబ్ది ఉత్సవాలకు సిద్ధం అవుతోంది. ఈ నెల 9, 10, 11, తేదీల్లో జరగనున్నాయి. 1924 ఏడాదిలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసఫ్స్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది.
అక్కడ గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు.