కర్ణాటకలోని కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయటపడింది. రాయచూర్ జిల్లాలోని ఓ గ్రామ సమీపంలోని నదిలో బయటపడిన ఈ విష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం ఆశ్చర్యపరుస్తోంది.
విగ్రహం చుట్టూ దశావతారాలు కనిపించాయి. విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో సుందరంగా దర్శనమిచ్చాడు. విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూమాలలు కూడా కనిపించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa